మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’(Mana Shankara Vara Prasad Garu) సంక్రాంతి కానుకగా జనవరి 12న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ అయి బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ రన్ కొనసాగిస్తోంది. దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ హిలేరియస్ ఎంటర్‌టైనర్ చిత్రంలో వింటేజ్ చిరంజీవి తనదైన కామిక్ టైమింగ్‌తో ఇరగదీశాడు. చిరుని ఇలా చూడాలని అభిమానులు ఎంతో కాలంగా వెయిట్ చేస్తూ వచ్చారు.
ఇక తమ అభిమాన హీరో నుంచి అదిరిపోయే బొమ్మ రావడంతో ప్రేక్షకులు ఈ సినిమాను చూసేందుకు థియేటర్లకు క్యూ కట్టారు. సినిమా రిలీజ్ అయి రెండు వారాలు దాటినా కూడా మన శంకర వరప్రసాద్ గారు సాలిడ్ రన్ కంటిన్యూ చేస్తోంది. ముఖ్యంగా ఓవర్సీస్‌లో ఈ సినిమాకు ప్రేక్షకులు పట్టం కడుతున్నారు. ఈ చిత్రం తాజాగా యూఎస్ బాక్సాఫీస్ దగ్గర ఏకంగా 4.5 మిలియన్ డాలర్ల మార్క్‌ను క్రాస్ చేసింది.
దీంతో చిరు కెరీర్‌లో మరో మైల్‌స్టోన్ ఈ చిత్రం అందుకుంది. ఇక నెక్స్ట్ టార్గెట్‌గా ఈ మూవీ 5 మిలియన్ డాలర్ల మార్క్‌ను ఎప్పుడెప్పుడు టచ్ చేస్తుందా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటించగా విక్టరీ వెంకటేష్ క్యామియో పాత్రలో నటించారు. భీమ్స్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని సాహు గారపాటి, సుష్మిత కొణిదెల ప్రొడ్యూస్ చేశారు.



