ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన సైన్స్ ఫిక్షన్ మైథాలజీ మూవీ ‘కల్కి 2898 AD'(Kalki 2898 AD) ఎలాంటి సెన్సేషనల్ హిట్‌గా నిలిచిందో అందరికీ తెలిసిందే. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి దిగ్గజాలు నటించిన ఈ చిత్రంలో దీపికా పదుకొణె ‘సుమతి’ పాత్రలో కీలక పాత్ర పోషించారు. అయితే, ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ (కల్కి 2) విషయంలో ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
‘కల్కి 2’ నుంచి దీపికా పదుకొణె తప్పుకున్నట్లు ఇప్పటికే మేకర్స్ వెల్లడించారు. ఇక ఆమె స్థానంలో ‘లేడీ పవర్ స్టార్’ సాయి పల్లవిని సుమతి పాత్ర కోసం పరిశీలిస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. వృత్తిపరమైన కారణాల దృష్ట్యా దీపికా ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారని, ఆ పాత్రకు సాయి పల్లవి అయితేనే న్యాయం చేయగలదని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఒకవేళ ఇదే నిజమైతే, సాయి పల్లవి కెరీర్‌లో ఇది మరో భారీ మైలురాయి కానుంది. ఇప్పటికే నితేష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘రామాయణం’లో ఆమె సీతగా నటిస్తోంది. ఇప్పుడు ‘కల్కి 2’ వంటి భారీ పాన్-ఇండియా ప్రాజెక్ట్‌లో చేరడం అభిమానుల్లో భారీ అంచనాలను పెంచుతోంది. అయితే ఈ విషయంపై చిత్ర యూనిట్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.


