రజినీకాంత్ బయోపిక్.. క్లారిటీ ఇచ్చిన ఐశ్వర్య..!

రజినీకాంత్ బయోపిక్.. క్లారిటీ ఇచ్చిన ఐశ్వర్య..!

Published on Jan 28, 2026 11:00 PM IST

Rajinikanth

సూపర్‌స్టార్ రజనీకాంత్ సినీ ప్రస్థానం ఎందరికో స్పూర్తిదాయకం. ఒక సాధారణ బస్సు కండక్టర్ నుంచి ప్రపంచం గర్వించే నటుడిగా ఆయన ఎదిగిన తీరు అద్భుతం. అయితే తాజాగా రజనీ అభిమానులకు ఆయన కుమార్తె ఐశ్వర్య ఒక శుభవార్త చెప్పారు. రజినీకాంత్ అభిమానులు ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్న రజినీ ఆటోబయోగ్రఫీ పై ఐశ్వర్య కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

తన తండ్రి ఆటోబయోగ్రఫీ చిత్ర పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని, అది విడుదలయ్యాక ప్రపంచవ్యాప్తంగా ఒక సెన్సేషన్‌ అవుతుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. దీంతో అభిమానుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. ఇక సినిమాల్లో మారుతున్న టెక్నాలజీతో ‘కోచ్చాడయాన్’ వంటి విజువల్ వండర్స్‌ను తెరకెక్కించగలిగాం అంటూ ఆమె చెప్పుకొచ్చారు.

అయితే, రజినీకాంత్ బయోపిక్ చిత్రంలో ఎలాంటి క్యాస్టింగ్ నటిస్తుంది.. ఎవరు ఆ ప్రెస్టీజియస్ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తారు అనే అంశాలపై ఆమె క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఇక ఈ సినిమాపై ఒక్కసారిగా అభిమానుల్లో మళ్లీ సందడి నెలకొంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు