మెగాస్టార్ చిరంజీవి హీరోగా నయనతార హీరోయిన్ గా దర్శకుడు అనీల్ రావిపూడి తెరకెక్కించిన అవైటెడ్ చిత్రమే “మన శంకర వరప్రసాద్ గారు”. ఫ్యామిలీ ఆడియెన్స్ లో మంచి బజ్ ని క్రియేట్ చేసిన ఈ సినిమా సంక్రాంతి రేస్ లో సాలిడ్ ఓపెనింగ్స్ పై కన్నేసింది. ఇక ఈ సినిమా నుంచి వస్తున్న ప్రతీ కంటెంట్ కూడా మంచి హిట్ గా నిలవడంతో అభిమానులు, ఇతర ఆడియెన్స్ లో మరింత హైప్ సెట్టయ్యింది.
ఇక ఇలా ఫైనల్ గా ఈ సినిమా ఓవర్సీస్ బుకింగ్స్ ని మొదలు పెట్టుకుంది. యూఎస్ సహా యూకే దేశాల్లో ఒకొక్కటిగా మన శంకర వరప్రసాద్ గారు బుకింగ్స్ ఇప్పుడు మొదలు అవుతున్నాయి. అంతే కాకుండా ఆల్రెడీ సాలిడ్ ఆక్యుపెన్సి లను కూడా ఈ షోస్ చూస్తున్నాయట. ఇలా ఇంకా ఎలాంటి టీజర్ లేకుండానే ఈ సినిమా మంచి స్టార్ట్ ని చూపిస్తుంది అని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రానికి భీమ్స్ సంగీతం అందిస్తుండగా షైన్ స్క్రీన్ వారు ఈ జనవరి 12న గ్రాండ్ గా రిలీజ్ కి తీసుకురాబోతున్నారు.
#ManaShankaraVaraPrasadGaru vachesaru ????????????????
Dallas @Cinemark bookings are now open for #MSG ????????????
Bring your family and celebrate the BIGGEST family entertainer of Sankranthi 2026 ????????????
Premieres Jan 11th.
Overseas by @sarigamacinemas pic.twitter.com/GgnbKFOoo7— Sarigama Cinemas (@sarigamacinemas) December 19, 2025


