మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో “మన శంకర వరప్రసాద్ గారు”9Mana Shankara Vara Prasad Garu) అనే ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ రాబోతుంది. ఐతే, ఈ సినిమా ఇంటర్వెల్ పై ఓ క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. నయనతార పై చేసిన ఎటాక్ నుంచి ఆమెను కాపాడే క్రమంలో మెగాస్టార్ చేసే యాక్షన్ సీక్వెన్స్ చాలా స్టైలిష్ గా ఉంటుందని.. పైగా విలన్స్ టార్గెట్ చేసింది నయనతార పాత్రనే అని ఇంటర్వెల్ లోనే రివీల్ అవుతుందట. తన మాజీ భార్యని ఆ ప్రాణాపాయం నుంచి హీరో ఎలా తప్పించాడు అనే కోణంలో సాగే సెకండాఫ్ ప్లే కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందట.
ఇక ఈ సినిమాలో మరో హీరో వెంకటేష్ కనిపించబోతున్న సంగతి తెలిసిందే. మరి ఫ్యాన్స్ ను ఈ సినిమా ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో చూడాలి. ఇక సాహు గారపాటి, సుస్మిత (చిరంజీవి కుమార్తె) సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమా గురించి మెగాస్టార్ ఆ మధ్య మాట్లాడుతూ.. ‘ఈ సినిమా పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రమని.. ఈ మూవీ కథ తనకు బాగా నచ్చిందని చెప్పారు. సంక్రాంతికి మెయిన్ స్పెషల్ గా రాబోతుంది కూడా ఈ సినిమానే.


