మూడు తరాల సినిమా మొదలైంది

Published on Jun 7, 2013 7:00 pm IST

manam
అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున మరియు నాగ చైతన్య నటిస్తున్న ‘మనం’ సినిమా ఈ మధ్య సినీవార్తలలో హాట్ టాపిక్. సమంత మరియు శ్రియ శరన్ హీరోయిన్స్. చరిత్రలోనే మొట్టమొదటిసారిగా అక్కినేని వంశంలో మూడు తరాల నటులు కలిసి నటిస్తున్న సినిమా కావడంతో వారి అభిమానులు ఎంతో ఆసక్తిగా సినిమాకోసం ఎదురుచూస్తున్నారు. ఈరోజు మొదలైన షూటింగ్లో సమంత కూడా మిగిలిన బృందంతో కలిసి పాల్గుంది. ‘ఇష్క్’ సినిమా తీసిన విక్రమ్ కుమార్ ఈ సినిమా దర్శకుడు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. సమాచారం ప్రకారం అక్టోబర్ నెలకల్లా ఈ సినిమా షూటింగ్ ముగించాలని అనుకుంటున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ సినిమాకు హర్షవర్ధన్ డైలాగులు అందిస్తున్నాడు. ఈ సినిమా కామెడి ప్రధానంగా సాగుతుంది

సంబంధిత సమాచారం :