“మనమే” నుండి ఇక నా మాటే సాంగ్ రిలీజ్ కి డేట్ ఫిక్స్!

“మనమే” నుండి ఇక నా మాటే సాంగ్ రిలీజ్ కి డేట్ ఫిక్స్!

Published on Mar 26, 2024 12:45 PM IST

టాలీవుడ్ హీరో శర్వానంద్ వరుస చిత్రాలు చేస్తూ, కెరీర్ లో దూసుకు పోతున్నారు. డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ మనమే. ఈ చిత్రం అనౌన్స్ మెంట్ తోనే అందరిలో ఆసక్తి నెలకొంది. కృతి శెట్టి ఈ సినిమా లో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రం కి సంబందించిన ఫస్ట్ సింగిల్ పై మేకర్స్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ను రిలీజ్ చేయడం జరిగింది.

ఇక నా మాటే అంటూ సాగే పాటను మార్చి 28 వ తేదీన రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. ఇదే విషయాన్ని వెల్లడించడానికి సరికొత్త పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. పోస్టర్ ఆడియెన్స్ ను విశేషం గా ఆకట్టుకుంటుంది. టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ హేషం అబ్ధుల్ వహబ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వ ప్రసాద్ మరియు వివేక్ కూచిభోట్ల సంయుక్తం గా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు