వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా “మంచి రోజులు వచ్చాయి”

వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా “మంచి రోజులు వచ్చాయి”

Published on Feb 21, 2022 3:46 PM IST

సంతోష్ శోభన్ హీరోగా, మెహ్రిన్ హీరోయిన్ గా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మంచి రోజులు వచ్చాయి. ఈ చిత్రం విడుదల అయ్యి పాజిటివ్ రెస్పాన్స్ ను దక్కించుకుంది. థియేటర్ల లో విడుదల అయిన ఈ చిత్రం ప్రస్తుతం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి సిద్దం అవుతుంది.

స్టార్ మా ఛానెల్ లో వచ్చే ఆదివారం ఈ చిత్రం సాయంత్రం 6 గంటలకు ప్రసారం కానుంది. అజయ్ ఘోష్ కీలక పాత్ర లో నటించిన ఈ చిత్రం కి అనూప్ రూబెన్స్ సంగీతం అందించగా, యూ వీ కాన్సెప్ట్స్ మరియు మాస్ మూవీ మేకర్స్ పతాకాల పై ఈ చిత్రాన్ని ఎస్కేఎన్ నిర్మించడం జరిగింది. బుల్లితెర పై ఈ చిత్రం ఎలాంటి రెస్పాన్స్ దక్కించుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు