సూపర్ కూల్ గా “మంచి రోజులు వచ్చాయి” ఫస్ట్ లుక్!

Published on Jul 20, 2021 11:01 pm IST

దర్శకుడు మారుతి దర్శకత్వంలో సంతోష్ శోభన్ హీరోగా మెహ్రిన్ కౌర్ హీరోయిన్ గా నటిస్తున్న తాజా చిత్రం మంచి రోజులు వచ్చాయి. ఈ చిత్రం టైటిల్ తో పాటుగా ఫస్ట్ లుక్ తాజాగా చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది. అయితే ఈ ఫస్ట్ లుక్ సూపర్ కూల్ గా ఉంది. ఈ చిత్రం ను మాస్ మూవీ మేకర్స్ మరియు యువి కాన్సెప్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అయితే ఈ చిత్రం ఒక రియల్ క్యారెక్టర్ ఆధారంగా తెరకెక్కినట్లు పోస్టర్ లో తెలియ జేయడం జరిగింది. ఫ్యామిలీ ఎంటర్ టైన్మెంట్ చిత్రాల తో పాటుగా ఫన్ అండ్ కామెడీ చిత్రాలు తీయడం లో మారుతి స్టీల్ డిఫరెంట్ అని అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రం మిగతా వాటికంటే కాస్త భిన్నంగా ఉంటుంది అని తెలుస్తోంది. అయితే ఈ చిత్రం త్వరలో థియేటర్ల లో విడుదల కి సిద్దం అయినట్లు తెలుస్తుంది. ఈ చిత్రానికి సంగీతం అనూప్ రూబెన్స్ అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :