మంచు మనోజ్ హీరోగా పాన్ ఇండియా మూవీ

Published on Feb 13, 2020 9:17 am IST

హీరో మంచు మనోజ్ ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమయ్యారు. ఆయన ఓ నూతన చిత్రంలో నటిస్తున్నట్లు నేడు ప్రకటించారు. ‘అహం బ్రహ్మాస్మి’ అనే ఓ పవర్ ఫుల్ టైటిల్ తో ఆయన కొత్త చిత్రం చేస్తున్నారు. ఈ చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమం మార్చి 6న హైదరాబాద్ లో గ్రాండ్ గా జరగనుంది. దర్శకుడు శ్రీకాంత్ రెడ్డి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నాడు . కాగా ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్ లో తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషలలో విడుదల కానుంది. ఆధ్యాత్మికతతో కూడుకున్న సోషియో ఫాంటసీ చిత్రంగా అహం బ్రహ్మస్మి ఉండనుందని సమాచారం.

వైవిధ్యమైన చిత్రాల హీరోగా పేరున్న మనోజ్ మరో డిఫరెంట్ స్టోరీని ఎంచుకున్నట్లు తెలుస్తుంది.అహం బ్రహ్మస్మి అనగా నేనే బ్రహ్మ అని అర్థం. ఇక ఈ చిత్రాన్ని తన సొంత నిర్మాణ సంస్థ ఎమ్ ఎమ్ ఆర్ట్స్ పతాకంపై తెరకెక్కిస్తున్నారు. ఇక వరుస పరాజయాలతో సతమవుతున్న మనోజ్ తెరపై కనిపించి రెండేళ్లు దాటి పోయింది. ఆయన చివరి చిత్రం ఒక్కడు మిగిలాడు 2017లో విడుదలైంది.

సంబంధిత సమాచారం :