టాలీవుడ్ లో ఏ హీరో చేయని సాహసం చేస్తున్న మనోజ్

Published on Feb 18, 2020 11:10 am IST

మంచు హీరో మనోజ్ వెండితెరపై కనిపించి చాలా కాలం అవుతుంది. 2017లో వచ్చిన ఒక్కడు మిగిలాడు చిత్రం తరువాత ఆయన మరో చిత్రం చేయలేదు. దాదాపు మూడేళ్ళ విరామం తరువాత మనోజ్ ఓ భారీ ప్రాజెక్ట్ ప్రకటించారు. అహం బ్రహ్మస్మి అనే టైటిల్ తో ఓ పాన్ ఇండియా మూవీ ఆయన హీరోగా తెరకెక్కించనున్నారు. వచ్చే నెల 6వ తేదీన గ్రాండ్ గా ఈ మూవీ ప్రారంభం కానుంది. దర్శకుడు శ్రీకాంత్ రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా ఎమ్ ఎమ్ ఆర్ట్స్ పతాకంపై మంచు విష్ణు స్వయంగా నిర్మిస్తున్నారు.

దాదాపు ఐదు భాషలలో గ్రాండ్ గా విడుదల కానున్న ఈ చిత్రంలోని మనోజ్ రోల్ పై ఆసక్తికర వార్త బయటికి వచ్చింది. మనోజ్ ఈ చిత్రంలో కొంత భాగం అఘోరాగా కనిపిస్తారట. శవాలను తింటూ, సమాజానికి దూరంగా ఉండే అఘోరాగా మనోజ్ నటన తారాస్థాయిలో ఉంటుందని సమాచారం. ఇక టాలీవుడ్ లో ఈ మధ్య కాలంలో ఏ హీరో అఘోరాగా నటించింది లేదు. మనోజ్ మొదటిసారి ఈ సాహసం చేస్తున్నారు. ఎన్నో ఆశలతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న అహం బ్రహ్మస్మి మనోజ్ కి మంచి విజయం అందించాలని ఆశిద్దాం.

సంబంధిత సమాచారం :

X
More