సూపర్ క్లిక్స్ : మంచు మనోజ్, మౌనికా రెడ్డి వెడ్డింగ్

Published on Mar 3, 2023 11:31 pm IST


యువ నటుడు మంచు మనోజ్, భూమా మౌనికా రెడ్డి ల వివాహం నేడు హైదరాబాద్ లో పలువురు కుటుంబసభ్యులు, అతిథుల సమక్షంలో ఎంతో ఘనంగా జరిగింది. నిజానికి కొన్నాళ్ల నుండి మనోజ్, మౌనికా ఇద్దరూ కూడా ప్రేమలో ఉన్నారని, త్వరలోనే వారి వివాహం జరుగనుందని పలు మీడియా మాధ్యమాల్లో కొన్నాళ్లుగా వార్తలు ప్రచారం అయిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల కొద్దిరోజుల వరకు దీనిపై ఎక్కడా కూడా అధికారిక క్లారిటీ లేదు.

ఇక రెండు రోజుల క్రితం వీరిద్దరి వివాహ విషయం పక్కాగా బయటకు రావడం అనంతం మంచు లక్ష్మి ప్రసన్న వివాహ ఏర్పాట్లకు దగ్గరుండి చూసుకోవడంతో ఫైనల్ మనోజ్, మౌనిక ఒక్కటవుతున్నట్లు తెలిసింది. ఇక నేడు వీరి వివాహ వేడుకకి విచ్చేసిన పలువురు మంచు కుటుంబసభ్యులు, అతిథులు నూతన వధూవరులని ఆశీర్వదించారు. కాగా వీరి వివాహ వేడుక తాలూకు ఫోటోలు కొద్దిసేపటి క్రితం బయటకు వచ్చాయి, ప్రస్తుతం ఆ సూపర్ క్లిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

సంబంధిత సమాచారం :