తగిన చర్యలు తీసుకోవాలంటున్న మంచు మనోజ్

Published on Jul 17, 2019 5:36 pm IST

సినీ హీరో మంచు మనోజ్ పేరు మీద నకిలీ ఓటర్ కార్డ్ జారీ అయింది. వాస్తవానికి మనోజ్ నివాసం ఉండేది ఫిల్మ్ నగర్లో. కానీ సంగారెడ్డి జిల్లా నారాయణ్‌ఖేడ్‌ మున్సిపాలిటీలోని చిరునామాతో ఆయనకు ఓటర్ ఐడీ జారీ అయినట్టు ప్రముఖ మీడియా సంస్థ వెల్లడించింది. త్వరలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న వేళ ఇలాంటి నకిలీ ఓటర్ ఐడీలు పుట్టుకొస్తున్నాయని తెలిపింది.

దీంతో స్పందించిన మంచు మనోజ్ తన అసలైన ఓటర్ ఐడీ ఫిల్మ్ నగర్ అడ్రెస్ మీదే ఉందని, సంగారెడ్డి జిల్లా నారాయణ్‌ఖేడ్‌ మున్సిపాలిటీ చిరునామాతో ఉండేది నకిలీదని అంటూ వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను, సంగారెడ్డి కలెక్టర్‌ను ట్విట్టర్ ద్వారా కోరారు. ఇకపోతే కొన్నాళ్ల క్రితం ఇకపై ప్రజాసేవలో ఉంటానంటూ ప్రకటించిన మనోజ్ ఇప్పటి వరకు కొత్త సినిమాకు సైన్ చేయలేదు.

సంబంధిత సమాచారం :

X
More