ప్రకాష్ రాజ్ రాజీనామా పై మంచు విష్ణు కీలక వ్యాఖ్యలు!

Published on Oct 11, 2021 2:42 pm IST

ముగిసిన మా అసోసియేషన్ ఎన్నికల్లో మంచు విష్ణు ప్రకాష్ రాజ్ పై గెలుపొందారు. అయితే ఊహించని రీతిలో నటుడు ప్రకాష్ రాజ్ మా సభ్యుడు గా ఉండను అంటూ రాజీనామా చేశారు. అయితే మంచు విష్ణు కి అభినందనలు తెలుపుతూ, తన రాజీనామా నిర్ణయం ను అంగీకరించాలి అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాక మా సభ్యుడు గా కాకుండా, తనకు ఎప్పుడు కూడా మద్దతు ఇస్తా అంటూ చెప్పుకొచ్చారు.

అయితే ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలకు మంచు విష్ణు సమాధానం ఇవ్వడం జరిగింది. మీరు తీసుకున్న నిర్ణయం పట్ల నేను సంతోషం గా లేను అని అన్నారు. మీరు నాకంటే పెద్దవారు, ఓటమి మరియు విజయం అనేవి ఒకే కాయిన్ కి రెండు వైపులా ఉంటాయి. మీరు ఈ సమయం లో ఎమోషనల్ అవ్వకూడదు అని రిక్వెస్ట్ చేస్తున్నా అని అన్నారు. మీ ఐడియాస్ కావాలి, మనం కలిసి పని చేద్దాం అని అన్నారు. మీరు నాకు రిప్లై ఇవ్వకండి, త్వరలో మిమ్మల్ని కలుస్తా, అప్పుడు మాట్లాడుకుందాం అని అన్నారు.

సంబంధిత సమాచారం :