మంచు విష్ణుకు కుమారుడు పుట్టాడు !

హీరో మంచు విష్ణు మరోసారి తండ్రి అయ్యారు. ఈరోజు సాయంత్రం మంచు విష్ణు భార్య విరోనిక మగబిడ్డకు జన్మనిచ్చారు. తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యాంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇద్దరు కుమార్తెలను కలిగిన విష్ణు ఈ సారి కూడా తనకు ఆడపిల్లే పుట్టాలని కోరుకుంటునట్లు సోషల్ మీడియాలో వెల్లడించిన సంగతి తెలిసిందే.

ఈ విషయం గురించి విష్ణు మాట్లాడుతూ… చాలా మంది తనకు కొడుకు పుడితే వారసుడుంటాడని సన్నిహితులు చెప్పారు. వాళ్ళందరిక తను సమాధానం ఇస్తూ.. ”నాకు ఇద్దరు వారసురాళ్ళు ఉన్నారు.. అరియానా, వివియానా. ఇంకొక అమ్మాయి పుడితే మూడో వారసురాలు అవుతుంది. అబ్బాయి పుడితే వారసుడు అవుతాడు. వారసత్వానికి అమ్మాయి, అబ్బాయి తేడాలేదని” తెలిపిన సంగతి తెలిసిందే.