పొలిటికల్ లీడర్ కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మంచు విష్ణు !
Published on Oct 23, 2017 5:10 pm IST


బీజేపీ నేత జివిఎల్. నరసింహరావ్ ఒక డిబేట్లో సినీ తారల గురించి మాట్లాడుతూ వాళ్లకు ఐక్యూ లెవల్స్, జనరల్ నాలెడ్జ్ చాలా తక్కువగా ఉంటుండంనే స్టేట్మెంట్ పాస్ చేశారు. దీంతో పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు ఆయన వ్యాఖ్యలను తీవ్ర స్థాయిలో ఖండించగా తెలుగు సినీ హీరో మంచి విష్ణు సైతం ఆయనకు ఘాటైన సమాధానమే ఇచ్చారు.

విష్ణు ట్విట్టర్ ద్వారా మాట్లాడుతూ ‘సినీ తారలందరికీ ఐక్యూ, జిక్యూ తక్కువగా ఉన్నట్టయితే రాజకీయ నాయకులంతా అవినీతిపరులే. గొప్ప గొప్ప రాజకీయ నాయకుల్లో చాలా మంది సినీ తారలే. ఉదాహరణకి ఎన్టీఆర్ రామారావుగారు, ఎంజిఆర్ గారు, కుమారి జయలలితగారు. ఎవరైన సరే తమ అభిప్రాయాన్ని చెప్పడానికి ఎక్కువ ఐక్యూ, జిక్యూ అవసరం లేదు.

నేను హిందువుని, క్రిష్టియన్ ని పెళ్లి చేసుకున్నాను. నాకు హిందూత్వం మీద చాలా నమ్మకముంది. ఇదెందుకు చెబుతున్నానంటే నేను చెప్పేది రాజకీయపరమైనది కాదు కాబట్టి. నాకు బీజేపీ అంటే చాలా గౌరవం. నేను మోదీగారికి పెద్ద అభిమానిని’ అన్నారు.

 
Like us on Facebook