మంచు విష్ణు ‘వెబ్‌ సిరీస్‌’.. చ‌ద‌రంగం !

Published on Jan 15, 2020 2:00 am IST

హీరో మంచు విష్ణు నిర్మాత‌గా ఓ పొలిటిక‌ల్ నేపథ్యంలో సాగే వెబ్‌సిరీస్‌ రూపొందుతున్న సంగతి తెలిసిందే. శ్రీకాంత్ ప్ర‌ధాన పాత్ర‌ధారిగా న‌టిస్తోన్న ఈ వెబ్‌ సిరీస్‌కు చ‌ద‌రంగం అనే టైటిల్‌ ను ఫిక్స్ చేశారు. రాజ్ అనే ద‌ర్శ‌కుడు తెర‌కెక్కిస్తోన్న ఈ వెబ్‌సిరీస్ 9 భాగాలుగా తెర‌కెక్కింది. ఫిబ్ర‌వ‌రి 20నుండి ఈ వెబ్ సిరీస్ ప్రసారం కానుంది. నాగినీడు, సునైన ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఆంధ్రప్ర‌దేశ్‌లో జ‌రిగిన కొన్ని వాస్త‌వ ఘ‌ట‌న‌ల‌ను ఆధారంగా చేసుకుని ఈ సినిమా వెబ్‌సిరీస్‌ను తెర‌కెక్కించారు.

ఇక విష్ణు హీరోగా నటిస్తోన్న హాలీవుడ్ చిత్రాన్ని జెఫ్రె చిన్ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈ చిత్రం షూటింగ్‌ లో ప్రధాన భాగం ఇప్పటికే పూర్తయింది. బాలీవుడ్ మాజీ యాక్షన్ హీరో సునీల్ శెట్టి ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఒకేసారి తెలుగు, ఇంగ్లీషు భాషల్లో ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమాలో విష్ణు మంచుతో పాటు హీరోయిన్ కాజ‌ల్ కూడా కీలక పాత్రలో నటిస్తోంది. ఈ యాక్ష‌న్ డ్రామా కోసం విష్ణు స‌తీమ‌ణి విరానికా నిర్మాత‌గా మారారు. వ‌యా మార్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, ఏవీఏ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్ట‌రీ నిర్మాణ సంస్థ‌లు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఓ ప్ర‌ముఖ హాలీవుడ్ యాక్ట‌ర్ ఈ చిత్రంలో న‌టించ‌నున్నారు. గత కొంతకాలంగా సరైన హిట్ లేని మంచు విష్ణు మొత్తానికి కెరీర్ ను పెద్ద స్థాయిలోనే ప్లాన్ చేస్తున్నాడు.

సంబంధిత సమాచారం :