భర్త మరణం పై నటి ఎమోషనల్ పోస్ట్ !

Published on Aug 15, 2021 9:25 pm IST

సీనియర్ నటి మందిరా బేడీ తన భర్త చనిపోవడంతో గత కొన్ని రోజులుగా తీవ్రమైన విషాదంలో మునిగిపోయింది. మందిరా బేడి భర్త, సినీ దర్శకుడు రాజ్‌ కౌశల్‌ జూన్‌ 30న గుండెపోటుతో మరణించారు. ఈ రోజు ఆయన జయంతి. ఈ సందర్భంగా మందిరా బేడి సోషల్ మీడియాలో ఒక మెసేజ్ చేస్తూ.. ‘ఆగస్టు 15 ఎల్లప్పుడూ నాకు వేడుకే. ఎందుకంటే ఈ రోజు రాజ్‌ పుట్టిరోజు. హ్యాపీ బర్త్‌డే రాజీ.. అని మందిరా బేడి ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.

మందిరా బేడి ఇంకా మెసేజ్ చేస్తూ.. ‘రాజ్ నేను నిన్ను చాలా మిస్‌ అవుతున్నాను. నువ్వు ఎక్కడ ఉన్నా మమ్మల్ని చూస్తున్నావని నమ్ముతున్నాను. నువ్వు లేని ఈ శూన్యత ఎన్నటికీ పూరించలేనిది. అయినా నిన్ను మరచిపోవడానికి నువ్వు నాకు జ్ఞాపకం కాదు కదా.. నువ్వు నా జీవితం’ అంటూ మందిరా బేడి ఎమోషనలైంది.

సంబంధిత సమాచారం :