అమలాపాల్‌ను అదృష్టం వరిస్తుందా ?

Published on May 10, 2019 4:10 pm IST

ఒకప్పుడు యువ హీరోల సినిమాలకు మంచి చాయిస్ అనిపించుకున్న నటి అమలాపాల్. ఈమహద్య కాలంలో ఆమెకు సినిమా ఆఫర్లు తగ్గాయి. చేసిన అరకొర సినిమాలు కూడా పెద్దగా సక్సెస్ సాధించలేదు. దీంతో ఆమె సాలిడ్ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఇలాంటి తరుణంలోనే ఆమెకు బంపర్ ఆఫర్ ఒకటి తగిలిందని ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.

అదే మణిరత్నం చేస్తున్న భారీ మల్టీస్టారర్ చిత్రం. పాపులర్ తమిళ నవల పొన్నియన్ సెల్వన్ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో ఒక పాత్ర కోసం అమలాపాల్ అయితే బాగుంటుందని ఆయన భావిస్తున్నారట. అయితే ఈ ప్రపోజల్ ఇంకా ఆమె వరకు వెళ్ళలేదట. మరి చూడాలి మణిరత్నం అమలాపాల్‌ను ఫైనల్ చేసుకుంటారో లేదో. మద్రాస్ టాకీస్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో జయం రవి, విక్రమ్, అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యరాయ్, అనుష్క, కీర్తి సురేష్, విజయ్ సేతుపతి లాంటి స్టార్లు నటించనున్నారు.

సంబంధిత సమాచారం :

More