
ఇండియన్ సినిమాలో దర్శకుడిగా తనదైన బ్రాండ్‌ను సెట్ చేసిన దర్శకుడు మణిరత్నం, ‘ఓకే బంగారం’ లాంటి మంచి హిట్ తర్వాత ప్రస్తుతం మరో ప్రేమకథకు రంగం సిద్ధం చేసుకున్న విషయం తెలిసిందే. కార్తీ, అదితి రావు హైదరి హీరో, హీరోయిన్లుగా నటించనున్న ఈ సినిమా ఈ వేసవిలోనే సెట్స్‌పైకి వెళ్ళేందుకు అంతా సిద్ధమైపోయినట్లు కనిపించింది. అయితే ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు సినిమా ఇప్పట్లో సెట్స్‌పైకి వెళ్ళే సూచనలు కనిపించడం లేదు.
కార్తీ ఇతర సినిమాలను లైన్లో పెట్టడం, డేట్స్ అడ్జస్ట్‌మంట్ వల్ల వాయిదా పడుతున్న వస్తోన్న ఈ సినిమా ప్రొడక్షన్ ఇంకొన్నాళ్లు ఇలాగే వాయిదా పడనున్నట్లు సమాచారం. ఈ సినిమా తెలుగు వర్షన్ హక్కులను ఇప్పటికే ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ సొంతం చేసుకున్నారు. కాగా సినిమా ఇంకా సెట్స్‌పైకి కూడా వెళ్ళకపోవడం విశేషం. కార్తీ ఓ పైలెట్‌గా కనిపించనున్న ఈ సినిమా ఎక్కువ భాగం కశ్మీర్‌లో షూటింగ్ జరుపుకోనుంది. మణిరత్నం స్వయంగా నిర్మిస్తోన్న ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్‌గా రవివర్మ, సంగీత దర్శకుడిగా ఏ.ఎర్.రహమాన్.. ఇలా టాప్ టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు.