‘మణికర్ణిక’ లేటెస్ట్ కలెక్షన్స్ !

Published on Jan 28, 2019 8:00 pm IST

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మణికర్ణిక : ది క్వీన్ అఫ్ ఝాన్సీ’. భారీ బడ్జెట్ తో ఝాన్సీ లక్ష్మీ బాయ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం ఫస్ట్ డే ఆశించిన స్థాయిలో కలెక్షన్లను రాబట్టలేకపోయినా.. ఆ తరువాత శని, ఆదివారాల్లో మాత్రం మంచి కలెక్షన్స్ ను రాబట్టింది. కాగా తాజాగా ‘మణికర్ణిక’ మూడు రోజులకు గానూ 40 కోట్ల మార్క్ దాటింది.

పోరాట యోధురాలు వీరనారి ‘రాణి లక్ష్మి భాయ్’ జీవిత చరిత్ర ఆదారంగా దర్శకుడు క్రిష్ మరియు హీరోయిన్ కంగనా సంయుక్తంగా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇక శంకర్ – ఎహసాన్ – లాయ్ లు ఈ సినిమాకి సంగీతం అందించారు. జీ స్టూడియోస్ మరియు కమల్ జైన్ సంయుక్తంగా నిశాంత్ పిట్టీతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు.

సంబంధిత సమాచారం :