తుది దశకు చేరుకున్న మణికర్ణిక షూటింగ్ !

తుది దశకు చేరుకున్న మణికర్ణిక షూటింగ్ !

Published on Oct 13, 2018 6:00 PM IST

Manikarnika

బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘మణికర్ణిక’ చిత్ర షూటింగ్ ఎట్టకేలకు చివరి దశకు చేరుకుంది. ఇటీవల పలు వివాదాలు చుట్టిన ముట్టిన నేపథ్యంలో అసలు ఈచిత్ర షూటింగ్ పూర్తిఅవుతుందా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. కానీ వాటికీ చెక్ పెడుతూ ఈ చిత్రంఅతి త్వరలో చిత్రీకరణ ను పూర్తి చేసుకోనుంది. ప్రస్తుతం ఈచిత్ర షూటింగ్ మధ్యప్రదేశ్ లో జరుగుతుంది. అక్కడ ఒక పాటను తెరకెక్కిస్తున్నారు. దాంతో ఈసినిమా షూటింగ్ పూర్తి కానుంది. ఇటీవల విడుదలైన ఈ చిత్ర టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈచిత్ర దర్శకుడు క్రిష్ ఎన్టీఆర్ బయోపిక్ ను తెరకెక్కిస్తూ బిజీ గా ఉండడంతో కంగనా నే ఈచిత్రానికి దర్శకత్వం వహిస్తుంది.

వీరనారి ఝాన్సీ లక్ష్మి బాయ్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంగీత త్రయం శంకర్- ఎహసాన్- లాయ్ లు స్వరాలు సమకూరుస్తున్నారు. భారీ బడ్జెట్ తో జీ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈచిత్రం వచ్చే ఏడాది జనవరి 25న విడుదలకానుంది.

తాజా వార్తలు