మణికర్ణిక కు కలిసి వచ్చిన రిపబ్లిక్ డే !

Published on Jan 27, 2019 11:21 am IST

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ నటించిన ‘మణికర్ణిక:ది క్వీన్ అఫ్ ఝాన్సీ కి రిపబ్లిక్ డే బాగా కలిసి వచ్చింది. ఈ నెల 25న విడుదలైన ఈ చిత్రం మొదటి రోజు తెలుగు , హిందీ , తమిళ భాషల్లో కలిపి ఇండియాలో 8.75కోట్ల షేర్ ను రాబట్టగా రెండవ రోజు దీనికి రెట్టింపు కలెక్షన్లను రాబట్టింది. నిన్న సెలవు దినం కావడంతో ఈ చిత్రం దేశ వ్యాప్తంగా 18.10కోట్ల షేర్ ను రాబట్టింది. దాంతో రెండు రోజులకుగాను చిత్రం ఇండియాలో మూడు భాషల్లో కలిపి 26.85 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది. ఇక ఈ రోజు కూడా ఈచిత్రం మంచి వసూళ్లను రాబట్టుకోనుంది.

కమల్ జైన్ నిర్మించిన ఈ చిత్రం ఝాన్సీ లక్ష్మి బాయ్ జీవితం ఆధారంగా రూపొందింది. క్రిష్ జాగర్లమూడి , కంగనా సంయుక్తంగా తెరకెక్కించిన ఈ చిత్రంలో అంకిత లోఖండే ముఖ్య పాత్రలో నటించింది.

సంబంధిత సమాచారం :