బాహుబలి స్థాయి చిత్రానికి రంగంసిద్ధం చేసిన లెజెండరీ డైరెక్టర్

Published on Nov 7, 2019 1:11 pm IST

బాహుబలి,2.0, సాహో,సైరా వంటి భారీ చిత్రాల తరువాత సౌత్ నుండి రానున్న మరొక భారీ చిత్రం పొన్నియెన్ సెల్వన్ . లెజెండరీ దర్శకుడు మణిరత్నం ఈ భారీ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటనున్న ఈ మూవీ లాంచింగ్ కి సిద్ధమైంది. వచ్చేనెలలో థాయిలాండ్ వేదికగా ఈ భారీ చిత్రాన్ని గ్రాండ్ గా ప్రారంభించనున్నారు. కల్కి కృష్ణమూర్తి రాసిన పొన్నియెన్ సెల్వన్ నవల ఆధారంగా ఈ చారిత్రాత్మక చిత్రం తెరకెక్కుతుంది. చోళ రాజుల డైనెస్టీలో ఒక రాజు వీరగాధే ఈ చిత్రం అని తెలుస్తుంది.

విక్రమ్, జయం రవి, ఐశ్వర్య రాయ్, కీర్తి సురేష్, అశ్విన్ మరియు ఆది పినిశెట్టి వంటి భారీ కాస్టింగ్ నటిస్తున్న ఈ మూవీలో టాలీవుడ్ నుండి మోహన్ బాబు ఓ కీలక పాత్ర చేయడం విశేషం. ఆయన ఐశ్వర్య రాయ్ భర్త పాత్ర చేస్తున్నారని గతంలో వార్తలు వచ్చాయి. ఇక ఈ భారీ పీరియాడిక్ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. సౌత్ నుండి మరో బాహుబలి స్థాయి చిత్రం పొన్నియెన్ సెల్వన్ అవుతుందని అందరూ భావిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More