మంజుల ఘట్టమనేని ‘నషా’ థ్రిల్లింగ్ అట !

Published on Oct 21, 2019 10:07 am IST

హీరోయిన్ హన్సికతో పాటు మంజుల ఘట్టమనేనితో ‘నషా’ అనే ఒక వెబ్ సిరీస్ ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. పిల్లజమీందార్ మరియు భాగమతి వంటి సూపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన దర్శకుడు అశోక్ ఈ వెబ్ సిరీస్ కి డైరెక్షన్ చేస్తున్నారు. ఇప్పటికే ‘నషా’ వెబ్ సిరీస్ షూటింగ్ ప్రోగ్రెస్ లో ఉంది. ముంబైలో నషా వెబ్ సిరీస్ చిత్రీకరణ జరుపుకొంటుంది. నటుడు అశుతోష్ రానా కూడా ఈ వెబ్ సిరీస్ లో ఒక పాత్ర చేస్తున్నారు. అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సిరీస్ మొత్తం థ్రిల్లింగ్ అంశాలతో సాగుతుందని తెలుస్తోంది.

ఇక ఇటీవలే ‘మనసుకు నచ్చింది’ అనే చిత్రానికి దర్శకత్వం వహించిన మంజుల షో, ఆరంజ్, కావ్యాస్ డైరీ వంటి చిత్రాలలో నటించారు. ఇక నిర్మాతగా కూడా ఆమె కొన్ని చిత్రాలు తెరకెక్కించడం జరిగింది. 2013లో వచ్చిన ‘సేవకుడు’ చిత్రం తరువాత మంజుల ఏ చిత్రంలో నటించలేదు. మళ్లీ ఆరేళ్ళ తరువాత ఈ వెబ్ సిరీస్ లో ఓ కీలకపాత్ర చేస్తున్నారు. మరి ఈ వెబ్ సిరీస్ తో ఆమె నటిగా బిజీ అవుతుందేమో చూడాలి.

సంబంధిత సమాచారం :

More