200 కోట్ల వసూళ్లతో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన “మంజుమ్మెల్ బాయ్స్”

200 కోట్ల వసూళ్లతో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన “మంజుమ్మెల్ బాయ్స్”

Published on Mar 19, 2024 7:00 PM IST

సౌభిన్ శాహిర్, శ్రీనాథ్ భాసి, బాలు వర్ఘెసి, గణపతి ఎస్. పొడువల్, లాల్ Jr., దీపక్ పరంబోల్, అభిరామ్ రాధాకృష్ణన్, అరుణ్ కురియన్, ఖలీద్ రెహమాన్, చందూ సలీం కుమార్, శెబిన్ బెన్సన్, విష్ణు రేఘు కీలక పాత్రల్లో, డైరెక్టర్ చిదంబరం దర్శకత్వం లో తెరకెక్కిన సర్వైవల్ థ్రిల్లర్ సినిమా మంజుమ్మెల్ బాయ్స్ (Manjummel boys). ఈ చిత్రం థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకుంటుంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకు పోతుంది.

మలయాళం లో చిన్న చిత్రం గా రిలీజై, ఇండస్ట్రీ హిట్ గా నిలిచి, చరిత్ర సృష్టించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద వరల్డ్ వైడ్ గా 200 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టడం జరిగింది. 200 కోట్ల రూపాయల క్లబ్ లో చేరిన తొలి మలయాళం చిత్రం గా నిలిచింది. పరవ ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రానికి సుషిన్ శ్యామ్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు