మన్మధుడు 2 యూఎస్ కలెక్షన్స్ రిపోర్ట్.

Published on Aug 11, 2019 9:24 pm IST

కింగ్ నాగార్జున లేటెస్ట్ మూవీ మన్మధుడు 2 ప్రపంచ వ్యాప్తంగా ఈనెల 9విడుదలైంది. కామెడీ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా వచ్చిన మన్మధుడు 2 కి ప్రేక్షకుల నుండి అలాగే క్రిటిక్స్ నుండి మిశ్రమ స్పందన లభించింది. రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ చిత్రం ఓపెనింగ్స్ పరంగా పర్వాలేదు అనిపించింది. కాగా మన్మధుడు 2 ఓవర్సీస్ వసూళ్లు అంత ఆశాజనకంగా లేవని తెలుస్తుంది. అమెరికాలో విడుదలైన మొదటిరోజు గురువారం,చెప్పుకోదగ్గ వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం శుక్రవారం నుండే బాక్సాపీస్ వద్ద డీలాపడినట్టు తెలుస్తుంది.

శనివారం అర్థ రాత్రి వరకు అందిన సమాచారం ప్రకారం మన్మధుడు 2 $63,636 వసూళ్లు రాబట్టినట్లు తెలుస్తుంది.ఈ చిత్రం ప్రీమియర్స్ తో కలుపుకొని రెండు రోజులకు గాను $1,93,651 వసూళ్లు సాధించింది. ఇక మిగిలిన సెలవు దినం ఆదివారం అయినా మన్మధుడు 2 వసూళ్లలో ఊపు చూపకపోతే కష్టమే అని ట్రేడ్ వర్గాల అంచనా. ఇంకా నాలుగు రోజులలో రణరంగం,ఎవరు వంటి చిత్రాల విడుదల నేపథ్యంలో మన్మధుడు 2 వసూళ్లు మరింత దిగజారే అవకాశం కలదు.

సంబంధిత సమాచారం :