నాగ్ కామెడీ టైమింగ్ హైలెట్ అట !

Published on Jul 19, 2019 12:00 am IST

రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌కత్వంలో కింగ్ నాగార్జున హీరోగా, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌ గా న‌టిస్తోన్న చిత్రం `మ‌న్మ‌థుడు 2`. ఈ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ ఇటీవలే షూటింగ్ పార్ట్ ను పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఫుల్ బిజీగా ఉంది. ఈ నెల మూడో వారం కల్లా ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలన్నీ పూర్తవుతాయట. ఇక ఈ చిత్రంలో నాగార్జున క్యారెక్టర్ ఫుల్ ఎంటర్ టైన్మెంట్ గా ఉంటుందని.. ప్రత్యేకించి నాగ్ కామెడీ టైమింగ్ సినిమా మొత్తంలోనే హైలెట్ గా నిలుస్తోందని తెలుస్తోంది.

దర్శకుడు రాహుల్ రవీంద్రన్ నాగ్ పాత్రను బాగా తీర్చిదిద్దారట. మరి ‘మన్మథుడు 2’, కామెడీలో ‘మన్మథుడు’ మించిపోతాడేమో చూడాలి. ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తుండగా సమంత, కన్నడ బ్యూటీ అక్షరా గౌడ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కాగా గత కొన్ని రోజుల నుండి ఈ సినిమా షూటింగ్ హైదరాబద్ లో శరవేగంగా జరుగుతుంది. ఈ చిత్రానికి నిర్మాతలు: నాగార్జున అక్కినేని, పి. కిరణ్, సంగీతం: చైతన్ భరద్వాజ్, సినిమాటోగ్రఫీ: ఎం సుకుమార్, స్క్రీన్ ప్లే: రాహుల్ రవీంద్రన్, సత్యానంద్

సంబంధిత సమాచారం :