మన్మధుడు 2 నైజాం లేటెస్ట్ కలెక్షన్స్…!

Published on Aug 11, 2019 10:55 am IST

కింగ్ నాగార్జున లేటెస్ట్ మూవీ మన్మధుడు 2 థియేటర్లలో సందడి చేస్తుంది. కామెడీ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా వచ్చిన మన్మధుడు 2 కి ప్రేక్షకుల నుండి అలాగే క్రిటిక్స్ నుండి మిశ్రమ స్పందన లభించింది. రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ చిత్రం ఓపెనింగ్స్ పరంగా కూడా పర్వాలేదు అనిపించింది. కాగా మన్మధుడు 2 నైజాంలో మొదటి రెండు రోజులకు గాను సాధించిన వసూళ్ల లెక్కలు ఇలా ఉన్నాయి.

మన్మమధుడు 2 రెండవ రోజు నైజాంలో 1,47,73,182 రూపాయల గ్రాస్ వసూళ్లు సాధించింది. అలాగే 1,27,87,581 రూపాయల నెట్ కలెక్షన్స్ రాబట్టగా, 66,81,664 రూపాయల షేర్ వసూలు చేసింది. మొత్తంగా రెండు రోజులకు గాను, 1,73,82,517 రూపాయల షేర్ సాధించింది. ఇక వారంత సెలవు దినమైన ఆదివారంతో పాటు, సోమవారం బక్రీద్ హాలిడే ఈ మూవీ వసూళ్లకు కొంచెం కలిసొచ్చే అంశమే. మరి ఈ రెండు సెలవు దినాలను మన్మధుడు 2 ఎంత వరకు సద్వినియోగం చేసుకుంటారో చూడాలి మరి.

నాగార్జున సరసన రకుల్ ప్రీత్ నటించిన ఈ మూవీని రాహుల్ రవీంద్ర తెరకెక్కించగా, అన్నపూర్ణ ప్రొడక్షన్స్, ఆనంది ఆర్ట్స్, వియాకామ్18 బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించాయి. వెన్నెల కిషోర్,రావు రమేష్, ఝాన్సీ ఇతర కీలక పాత్రలలో నటించారు.

సంబంధిత సమాచారం :