మ‌న్మ‌థుడు 2 నైజాం 3 రోజుల కలెక్షన్స్ !

Published on Aug 12, 2019 11:46 am IST

కింగ్ నాగార్జున హీరోగా, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌ గా నటించిన చిత్రం `మ‌న్మ‌థుడు 2`. రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌కత్వంలో రొమాంటిక్ ఎంట‌ర్‌ టైన‌ర్ గా భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమాకి ప్రేక్షకుల నుండి అలాగే క్రిటిక్స్ నుండి మిశ్రమ స్పందన లభించింది. రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ చిత్రం ఓపెనింగ్స్ పరంగా కూడా జస్ట్ పర్వాలేదనిపించుకుంది.

కాగా `మ‌న్మ‌థుడు 2` మూడవ రోజు నైజాంలో 1,25,70,555 రూపాయల గ్రాస్ వసూళ్లు సాధించింది. అలాగే 1,08,83,886 రూపాయల నెట్ కలెక్షన్స్ రాబట్టగా, 54,09,661 రూపాయల షేర్ ను వసూలు చేసింది. మొత్తంగా మూడు రోజులకు గానూ నైజాంలో `మ‌న్మ‌థుడు 2` 2,28,50,459 రూపాయలను సాధించింది. ఇక ఈ రోజు బక్రీద్ సందర్భంగా హాలిడే కావడంతో ఈ మూవీ వసూళ్లకు కొంచెం కలిసొచ్చే అవకాశం ఉంది.

అన్నపూర్ణ ప్రొడక్షన్స్, ఆనంది ఆర్ట్స్, వియాకామ్18 బ్యానర్స్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించాయి. వెన్నెల కిషోర్,రావు రమేష్, ఝాన్సీ ఇతర కీలక పాత్రలలో నటించారు.

సంబంధిత సమాచారం :