మే 21న నుండి ‘మన్మథుడు 2’ హైదరాబాద్ లోనే !

Published on May 13, 2019 10:14 am IST

రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నాగార్జున హీరోగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా వస్తోన్న చిత్రం ‘మన్మథుడు 2’. కాగా గత నెల రోజుల నుండి ఈ సినిమా షూటింగ్ పోర్చు‌గ‌ల్‌ లో శరవేగంగా జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ షెడ్యూల్ ఈ రోజుతో పూర్తయింది. ఇక తరవాతి షెడ్యూల్ ను మే 21వ తేదీ నుండి హైదరాబాద్ లో మొదలు కానుంది.

ఈ చిత్రంలో సమంత, కన్నడ బ్యూటీ అక్షరా గౌడ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక నాగ్ బెస్ట్ మూవీస్ లో మ మన్మథుడు ముందు వరుసలో ఉంటుంది. మరి అలాంటి మూవీకి సీక్వెల్ గా వస్తోన్న ఈ మన్మథుడు 2 ఎలా మెప్పిస్తాడో చూడాలి. ఆర్ఎక్స్ 100 ఫేమ్ చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తుంది. దసరా కానుకగా ఈ చిత్రం విడుదలకానుంది.

ఈ చిత్రానికి నిర్మాతలు: నాగార్జున అక్కినేని, పి. కిరణ్, సినిమాటోగ్రఫీ: ఎం సుకుమార్, స్క్రీన్ ప్లే: రాహుల్ రవీంద్రన్, సత్యానంద్.

సంబంధిత సమాచారం :

More