మన్మథుడు 2 షూటింగ్ అప్డేట్ !

Published on Mar 17, 2019 8:07 pm IST

దేవదాస్’ తరువాత ఇటీవల బాలీవుడ్ మూవీ బ్రహ్మస్త్ర లో గెస్ట్ రోల్ చేసిన అగ్ర హీరో నాగార్జున తన కొత్త చిత్రంలో నటించడానికి రెడీ అవుతున్నాడు. ‘చి ల సౌ’ ఫేమ్ రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నాగ్ , ‘మన్మథుడు 2’ లో నటించనున్నాడు. ఇక ఈ చిత్రం యొక్క షూటింగ్ ఈనెల 25న హైదరాబాద్ లో స్టార్ట్ కానుందని సమాచారం. ఈ షెడ్యూల్ ఏప్రిల్ 4వరకు జరుగనుందట. ఆ తరువాత మేజర్ పార్ట్ షూటింగ్ అంత యూరప్ లో జరుగనుంది. ఇక ఈ చిత్రంలో నాగ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్, పాయల్ రాజ్ పుత్ కథానాయికలుగా నటించనుండగా ఆర్ఎక్స్ 100 ఫేమ్ చైతన్ భరద్వాజ్ సంగీతం అందించనున్నాడు.

నాగ్ కెరీర్ లో అల్ టైం సూపర్ హిట్ మూవీ మన్మథుడు కి సీక్వెల్ రానున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించనుంది.

సంబంధిత సమాచారం :