ఆడియో అవిష్కరణలో ‘మార్షల్’ !

Published on Aug 26, 2019 11:00 am IST

జై రాజాసింగ్ దర్శకత్వంలో అభయ్, మేఘా చౌదరి జంటగా నటించిన చిత్రం ‘మార్షల్’. హీరో శ్రీకాంత్ ఓ ముఖ్యమైన పాత్ర పోషించిన ఈ చిత్రాన్ని హీరో అభయ్ తన సొంత బ్యానర్లోనే నిర్మిస్తున్నారు. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని సెప్టెంబరు 19న విడుదలవుతోంది. ఈ చిత్రం ఆడియో, టీజర్ అవిష్కరణ ఇటీవలే గుంటూరులో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అంబటి రాంబాబు హాజరై… ఆడియోను ఆవిష్కరించారు.

ఇక ఈ సినిమాకు ‘కె జి ఎఫ్’ మ్యూజిక్ ఫేమ్ రవి బసురి, మార్షల్ సినిమా కంటెంట్ ప్రత్యేకంగా నచ్చి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మరి ఈ సినిమాలో రీ రికార్డింగ్ తో పాటు 2 పాటలను సమకూర్చారు. ఈ కార్యక్రమంలో షేక్ మహమ్మద్ ముస్తఫా, మద్దాలి గిరి, వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు అప్పిరెడ్డి, పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త చంద్రగిరి ఏసురత్నం, ముస్తఫా మరియు మద్దాల గిరి, బోనబోయిన శ్రీనివాసయాదవ్, నిమ్మకాయల రాజా నారాయణ, హీరోయిన్ మేఘా చౌదరి పాల్గొన్నారు.

సంబంధిత సమాచారం :