‘ది రాజా సాబ్’ రెస్పాన్స్ పై మారుతి కామెంట్.. అప్పుడే అర్థమవుతుంది..!

‘ది రాజా సాబ్’ రెస్పాన్స్ పై మారుతి కామెంట్.. అప్పుడే అర్థమవుతుంది..!

Published on Jan 13, 2026 11:01 PM IST

Maruthi

పాన్ ఇండియా ప్రభాస్ నటించిన ‘ది రాజా సాబ్’ సినిమాకు ప్రేక్షకుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. మారుతి దర్శకత్వంలో రూపొందిన ఈ హారర్ ఫాంటసీ సినిమాపై ప్రేక్షకుల్లో పెద్దగా పాజిటివ్ టాక్ వినిపించడం లేదు. పండుగ సీజన్ దగ్గర పడుతుండటంతో, దర్శకుడు మారుతి సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు.

ఈ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మారుతి చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. “మొదటిసారి సినిమా చూసినప్పుడు దాంట్లో ఉన్నది మాత్రమే కనిపిస్తుంది. రెండోసారి చూసినప్పుడు మాత్రమే ది రాజా సాబ్ లోని డెప్త్ రైటింగ్ అర్థమవుతుంది. నిజంగా అర్థం కావాలంటే మరోసారి సినిమా చూడాలి” అని మారుతి అన్నారు.

మారుతి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సంజయ్ దత్, మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్, జరీనా వహాబ్ కీలక పాత్రల్లో నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

తాజా వార్తలు