విజిల్స్, మాస్ డాన్స్ లతో “పక్కా కమర్షియల్” సెట్ లో “భీమ్లా నాయక్” గ్లింప్స్ సెలబ్రేషన్స్!

Published on Aug 15, 2021 11:16 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుపాటి లు ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం భీమ్లా నాయక్. ఈ చిత్రం టైటిల్ ను మరియు ఫస్ట్ గ్లింప్స్ ను చిత్ర యూనిట్ ఆగస్ట్ 15 వ తేదీన ఉదయం 9:45 గంటలకు విడుదల చేయడం జరిగింది. గ్లింప్స్ లో పవన్ కళ్యాణ్ మాస్ విశ్వరూపం చూపించారు అని చెప్పాలి. తూటా లాంటి డైలాగ్ తో, అగ్రెసివ్ యాటిట్యూడ్ తో పవన్ గ్లింప్స్ ఆద్యంతం కొనసాగింది. దానికి తోడు థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మరింత గా ఆకట్టుకుంది.

అయితే ఈ చిత్రం నుండి విడుదల అయిన గ్లింప్స్ తో కేవలం పవన్ కళ్యాణ్ అభిమానులు, ప్రేక్షకులు, సెలబ్రిటీ లు సూపర్ పాజిటివ్ గా రెస్పాన్స్ ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్ మాస్ విశ్వరూపం కనిపించడం తో అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు.

టాలీవుడ్ డైరెక్టర్ మారుతీ ప్రస్తుతం పక్కా కమర్షియల్ అంటూ హీరో గోపీచంద్ తో ఒక సినిమా చేస్తున్నారు. యూ వీ క్రియేషన్స్ మరియు గీతా ఆర్ట్స్ పతాకాల పై తెరకెక్కుతున్న పక్కా కమర్షియల్ చిత్రం లో గోపీచంద్ సరసన హీరోయిన్ గా రాశి ఖన్నా నటిస్తుంది. ఈ సినిమా సెట్స్ లో నేడు పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ గ్లింప్స్ సెలబ్రేషన్స్ జరిగిన వీడియో ను సోషల్ మీడియాలో షేర్ చేశారు డైరక్టర్ మారుతీ. ఆ వీడియో కాస్త ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ సినిమా కి సంబందించిన ఫస్ట్ సింగిల్ సెప్టెంబర్ 2 వ తేదీన పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల కానుంది. ఈ చిత్రానికి మాటలు త్రివిక్రమ్ శ్రీనివాస్ అందిస్తుండగా, శేఖర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :