స్యూర్ షాట్..వార్ వన్ సైడ్ చేసిన రవితేజ.!

Published on Jan 15, 2021 12:00 pm IST

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా గోపిచం మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మాస్ ఎంటర్టైనర్ చిత్రం “క్రాక్”.ఈ ఏడాది సంక్రాంతి పండుగను కాస్త ముందు గానే మొదలు పెట్టి అది కూడా ఈ ప్యాండమిక్ టైం లో కూడా భారీ రెస్పాన్స్ ను అందుకొని స్యూర్ షాట్ హిట్ గా నిలిచింది.

మరి ఆడియెన్స్ పల్స్ ప్రకారం చూస్తే కనుక మాస్ మహారాజ్ ఈ సంక్రాంతి పందాన్ని వార్ వన్ సైడ్ చేసాడనే చెప్తున్నారు. కేవలం బాక్సాఫీస్ వసూళ్ల లెక్కలు మాత్రమే కాకుండా అనుకున్న అంచనాలను రీచ్ అయ్యి బ్రేక్ ఈవెన్ కావడం అనేది ఇప్పుడున్న సినిమాల్లో ఇదొక్కటే చేసింది అని అంటున్నారు.

అలా ఈ చిత్రం సంక్రాంతి రేస్ లో వార్ వన్ సైడ్ చేసేసింది అని చెప్పొచ్చు. మరి అలాగే రవితేజ కెరీర్ లోనే ఇది ఒక మరపురాని సాలిడ్ హిట్ అండ్ నెవర్ బిఫోర్ కం బ్యాక్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే కేవలం 50 శాతం ఆక్యుపెన్సీతో ఇలాంటి ఫీట్ మంచి టాక్ తో అందుకోవడం అరుదే అని చెప్పాలి. సో ఈ కం బ్యాక్ మాస్ మహారాజ్ కు ప్రత్యేకమే అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :