రవితేజ “రావణాసుర” లో కీలక లెంగ్తీ షెడ్యూల్ పూర్తి..!

Published on Apr 12, 2022 4:03 pm IST

టాలీవుడ్ మాస్ మహారాజ రవితేజ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సాలిడ్ సబ్జెక్టు లలో దర్శకుడు సుధీర్ వర్మ తో చేస్తున్న భారీ ప్రాజెక్ట్ “రావణాసుర” కూడా ఒకటి. ఏకకాలంలో అన్ని సినిమాలు జెట్ స్పీడ్ తో కంప్లీట్ చేస్తున్న మాస్ మహారాజా లేటెస్ట్ గా ఈ సినిమాలోని ఒక కీలక షెడ్యూల్ అందులోని చాలా లెంగ్తీ షెడ్యూల్ ని కంప్లీట్ చేసినట్టుగా కన్ఫర్మ్ అయ్యింది.

అయితే ఈ షూట్ లో పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించడమే కాకుండా భారీ యాక్షన్ సీక్వెన్స్ ని కూడా ఈ షెడ్యూల్ లోనే కంప్లీట్ చేసినట్టు తెలుస్తుంది. మరి సినిమాలో ఇవి ఎలా ఉంటాయో చూడాలి. మరి ఈ సినిమాలో మొత్తం ఐదుగురు హీరోయిన్స్ నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ చిత్రానికి భీమ్స్ మరియు హర్షవర్ధన్ అందిస్తుండగా అభిషేక్ పిక్చర్స్ మరియు రవితేజ ప్రొడక్షన్ హౌస్ బ్యానర్స్ పై భారీ బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.

సంబంధిత సమాచారం :