దసరా ను టార్గెట్ చేస్తున్న మాస్ రాజా !

Published on Mar 19, 2019 9:19 pm IST

గత ఏడాది హ్యాట్రిక్ డిజాస్టర్ లను చవి చూసిన మాస్ రాజా రవితేజ ఇటీవల తన కొత్త చిత్రం డిస్కో రాజా ను స్టార్ట్ చేశాడు. ‘ఎక్కడికిపోతావు చిన్నవాడ’ ఫెమ్ వి ఐ ఆనంద్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం మొదటి షెడ్యూల్ ను జరుపుకుంటుంది. సైన్టిఫిక్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో ఈ చిత్రంలో రవితేజ సరసన నాబా నటేష్ , పాయల్ రాజ్ పుత్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని దసరా బరిలో నిలిపేలా సన్నాహాలు చేస్తున్నారు. ప్రముఖ తమిళ హీరో బాబీ సింహ ఈ చిత్రంలో విలన్ గా నటిస్తున్నాడు.

ఎస్ ఆర్ టి ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ ఫై రవి తాళ్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ చిత్రం తో పాటు రవితేజ కందిరీగ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ తో సినిమా చేయనున్నాడు. సూపర్ హిట్ కోలీవుడ్ మూవీ తెరి కి రీమేక్ గా తెరకెక్కనుంది ఈ చిత్రం.

సంబంధిత సమాచారం :