‘నా పేరు సూర్య’ నుండి రాబోతున్న మాస్ సాంగ్ !


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న ‘నా పేరు సూర్య’ చిత్రం చివరి దశ చిత్రీకరణలో ఉంది. ఏప్రిల్ మొదటి నుండి చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాల్ని కూడ ముమ్మరం చేయనుంది. ఇప్పటికే ఈ చిత్రం నుండి ‘లవర్ ఆల్సో ఫైటర్ ఆల్సో, సైనిక’ వంటి పాటలు విడుదలై ఆకట్టుకోగా ఇప్పుడు మరొక పాట బయటకురానుంది.

అయితే ఈ సాంగ్ గత రెండు పాటల్లా కాకుండ పూర్తిగా పవర్ ఫుల్ బీట్స్ తో నిండి మాస్ పాటలా ఉంటుందని చిత్ర సంగీత దర్శకుడు, గాయకుడు విశాల్ డడ్లాని అన్నారు. అయితే ఈ పాట ఎప్పుడు బయటికొస్తుందనేది మాత్రం ఇంకా తెలియలేదు. వక్కంతం వంశీ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం మే 4న విడుదలకానుండగా ఇందులో బన్నీకి జోడీగా అను ఇమ్మాన్యుయేల్ నటిస్తోంది.