“ఆదిపురుష్” నెక్స్ట్ సాంగ్ కి మాసివ్ ప్లానింగ్స్.!

Published on May 25, 2023 7:05 am IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు ఓంరౌత్ తో చేసిన బిగ్గెస్ట్ విజువల్ వండర్ చిత్రం “ఆదిపురుష్” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ భారీ సినిమా కోసం ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఇప్పుడు మేకర్స్ సినిమా అప్డేట్స్ ఒకొకటిగా రివీల్ చేస్తున్నారు. మరి సినిమా నుంచి ఆల్రెడీ వచ్చిన మొదటి సాంగ్ సెన్సేషనల్ రెస్పాన్స్ ని అందుకోగా ఇప్పుడు రెండో సాంగ్ రిలీజ్ కి మేకర్స్ సన్నద్ధం అవుతున్నారు.

అయితే ఈ సాంగ్ ని ఈ మే 29న రిలీజ్ కి ప్లాన్ చేస్తుండగా ఈ సాంగ్ కి అయితే మాసివ్ ప్లానింగ్ లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ 29న ఇండియా వైడ్ గా మెయిన్ గా నార్త్ మార్కెట్ లో అయితే అనేక టీవీ ఛానెల్స్, మ్యూజిక్ ప్లాట్ ఫామ్ లు, యూట్యూబ్ సహా రేడియో స్టేషన్ లలో కూడా ఏకకాలంలో రిలీజ్ చేసే యత్నం చేస్తున్నారట. మొత్తానికి అయితే ఇది మరో బిగ్గెస్ట్ ప్లాన్ అని చెప్పాలి. ఇక ఈ అవైటెడ్ సినిమా అయితే ఈ జూన్ 16న రిలీజ్ కానుండగా ఈ జూన్ 6న గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది.

సంబంధిత సమాచారం :