బాలయ్య ఫస్ట్ హంట్ కి 1 కోటికి పైగా మాస్ రెస్పాన్స్.!

Published on Jun 11, 2022 10:03 am IST


నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా మాస్ దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న లేటెస్ట్ భారీ యాక్షన్ డ్రామా కోసం అందరికీ తెలిసిందే. బాలయ్య కెరీర్ లో 107వ సినిమాగా వస్తున్న ఈ చిత్రం నుంచి మేకర్స్ మొన్ననే బాలయ్య బర్త్ డే కానుకగా ఒక మాసివ్ టీజర్ ని రిలీజ్ చెయ్యగా దానికి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది.

మరి దీని హవా అయితే ఇప్పటికీ తగ్గలేదని చెప్పాలి. లేటెస్ట్ గా ఈ టీజర్ ఏకంగా 1.1 కోటి వ్యూస్ ని క్రాస్ చేసి అదరగొట్టింది. అంతే కాకుండా యూట్యూబ్ లో నెంబర్ 1 స్థానంలో ట్రెండింగ్ లోకి వచ్చేసింది. మొత్తానికి అయితే బాలయ్య ఫస్ట్ హంట్ మాత్రం మామూలుగా స్టార్ట్ అవ్వలేదని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :