మన తెలుగు నుంచి మంచి టాలెంట్ ఉన్న నటీనటుల్లో యువ నటుడు చైతన్య రావు కూడా ఒకరు. 30 వెడ్స్ 21 సిరీస్ తో మంచి గుర్తింపు అందుకోవడమే కాకుండా కీడా కోలా, వకీల్ సాబ్ ఇంకా రీసెంట్ గా మయసభ అనే సిరీస్ లో వెర్సటైల్ నటనను కనబరిచిన ఈ టాలెంటెడ్ నటుడు నుంచి ఓ షాకింగ్ బోల్డ్ మూవ్ ఇప్పుడు అందరికీ సర్ప్రైజ్ టేక్ అందించింది.
సెన్సేషనల్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఈ నటుడు నటిస్తున్న కొత్త చిత్రం ‘దిల్ దియా’ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయగా అందులో పూర్తి నగ్నంగా కనిపిస్తున్నాడు. ఇది ఒక్కసారిగా చూసిన తెలుగు ఆడియెన్స్ కూడా ఒకింత షాకవుతున్నారు. ఇక ఈ బోల్డ్ అటెంప్ట్ ని దర్శకుడు క్రాంతి మాధవ్ తెరకెక్కిస్తుండగా ఫణి కళ్యాణ్ సంగీతం అందిస్తున్నారు. అలాగే పూర్ణ నాయుడు నిర్మాణం వహించిన ఈ చిత్రాన్ని మేకర్స్ ఈ ఏడాదిలోనే వేసవి రేస్ లో థియేటర్స్ లో విడుదల చేయబోతున్నారు.
Here’s the first look poster of my dear friend's @bykranthi 5th film ????
WISHING YOU ALL THE LUCK ????
CONGRATULATIONS ???? Poster is very intriguing and deep ????#DILDIYA @IamChaitanyarao @bykranthi @Ira_dayanand @PoornaNaiduProd @phanikalyang @pgvinda @beyondmediapres… pic.twitter.com/4YrwlglagQ— Sandeep Reddy Vanga (@imvangasandeep) January 3, 2026


