తారక్ ఈ బిగ్ ప్రాజెక్ట్ నుంచి ఎలాంటి అప్డేట్ ఉండకపోవచ్చు.!

Published on May 8, 2021 7:23 am IST

ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరో హీరోగా దర్శకుడు రాజమౌళితో రౌద్రం రణం రుధిరం అని బిగ్ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. మరి దీని తర్వాత కూడా ఈ ఇద్దరు స్టార్ హీరోలు పలు భారీ చిత్రాల లైనప్ ను పెట్టుకున్నారు. అయితే తారక్ కూడా థన్ బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివతో తన 30వ ప్రాజెక్ట్ ను ప్లాన్ చేసుకున్న సంగతి తెలిసిందే.

దీనిపై రీసెంట్ గానే అనౌన్సమెంట్ కూడా వచ్చిన సంగతి తెలిసిందే. ఐటీ లేటెస్ట్ టాక్ ప్రకారం మాత్రం ఈ సెన్సేషనల్ కాంబోపై రాబోయే రోజుల్లో మెజర్ అప్డేట్ ఏమీ ఉండదట. అంటే రాబోయే తారక్ పుట్టినరోజున పెద్దగా ఎలాంటి అనౌన్సమెంట్ ఈ ప్రాజెక్ట్ నుంచి ఉండకపోవచ్చని తెలుస్తుంది. అందుకే ఆ రోజుకి ఈ ప్రాజెక్ట్ పై మాత్రం అభిమానులు తక్కువ అంచనాలు పెట్టుకుంటేనే మంచిది. కానీ రాజమౌళితో సినిమా నుంచి మాత్రం ఖచ్చితంగా అప్డేట్ రానుంది.

సంబంధిత సమాచారం :