
పెళ్లి చేసుకుని సినీ ఇండస్ట్రీకి దూరమైన మీనా మళ్ళీ తెరపైకి వచ్చింది. విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన ‘దృశ్యం’ సినిమాలో మీనా ఓ కీలక పాత్రలో కనిపించింది. సినీ ప్రేక్షకులు మీనా పెర్ఫార్మన్స్ కి మంచి మార్కులు వేశారు. అలాగే మీనా ఈ సినిమాతో కొత్త ఇన్నింగ్స్ ని ప్రారంభించింది.
ఇటీవలే మీనా మీడియాతో మాట్లాడినప్పుడు మీ కెరీర్లో మీరు పశ్చాత్తాప పడాల్సిన సందర్భాలు ఏమన్నా ఉన్నాయా అని అడిగితే ‘వ్యక్తిగతంగా ఏమీ లేవు. కానీ కెరీర్ పరంగా మాత్రం డేట్స్ అడ్జస్ట్ కాక కొన్ని సినిమాలు వదులుకున్నాను. అందులో రజినీకాంత్ గారి నరసింహా ఒకటి. ముందుగా నీలాంబరి పాత్ర కోసం నన్ను అనుకున్నారు కానీ డేట్స్ లేక ఆ సినిమా వదులుకున్నాను. ఆ సినిమా విషయంలో ఎప్పుడూ బాధపడుతుంటానని’ తెలిపింది. దీని ప్రకారం మీనా గోల్డెన్ చాన్స్ మిస్ అయ్యిందని ఫీలవుతున్నారా?