మోహన్‌లాల్ ‘బ్రో డాడీ’లో ఛాన్స్ కొట్టేసిన మీనా..!

Published on Jul 23, 2021 3:06 am IST

మోహన్ లాల్, మీనాలకు మలయాళంలో సూపర్ హిట్ జోడిగా పేరుంది. ఇప్పటికే వీరిద్దరు జోడీగా పలు సినిమాలు చేయగా, చివరగా దృశ్యం-2లో కూడా చేశారు. అయితే మరోసారి మోహన్ లాల్ సినిమాలో మీనా నటిస్తోంది. పృధ్వీరాజ్ దర్శకత్వంలో ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్‌లో ఆంటోనీ పెరుంబవూర్ నిర్మిస్తున్న ‘బ్రో డాడీ’ సినిమాల నటించబోతుంది.

అయితే ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ షూటింగ్ గత వారం హైదరాబాద్‌లో ప్రారంభమయ్యింది. తాజాగా ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొనట్టు మీనా సోషల్ మీడియా ద్వారా తెలిపింది. అయితే ఈ సినిమాలో మీనా మోహన్‌లాల్ సరసన నటిస్తుందా లేక ఇతర పాత్రలో నటిస్తుందా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో పృధ్వీరాజ్, కళ్యాణీ ప్రియదర్శన్, లాలు అలెక్స్, మురళీ గోపి, సౌబిన్ ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

సంబంధిత సమాచారం :