మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్‌లో వస్తున్న ‘మెగా 158’ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. వీరిద్దరి కాంబోలో వస్తున్న రెండవ సినిమా ఇది. గతంలో వీరి కాంబో సూపర్ హిట్ కావడంతో, ఈసారి దర్శకుడు బాబీ మెగాస్టార్‌ను సరికొత్త అవతారంలో ఎలా చూపించబోతున్నాడా అనే ఆసక్తి అందరిలోనూ విపరీతంగా పెరిగిపోయింది.
తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక క్రేజీ అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ అధికారికంగా ఒక విషయాన్ని వెల్లడించాడు. ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా.. అంటే ఆగస్టు 22, 2026 న ‘మెగా 158’ చిత్ర టీజర్‌ను విడుదల చేయబోతున్నట్లు ఆయన ప్రకటించాడు. ఈ ప్రకటనతో మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మొదటి గ్లింప్స్ కోసం వారంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
ఈ సినిమాలో చిరంజీవితో పాటు మలయాళ నటి అనశ్వర రాజన్, నివేదా పేతురాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు.


