ఎన్టీఆర్ బయోపిక్ లో మెగా బ్రదర్ !

Published on Sep 3, 2018 3:17 pm IST

విశ్వ విఖ్యాత నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంలో మరో ప్రముఖ నటుడు జాయిన్ అయ్యారు. ఎస్ వి రంగారావు పాత్రకు మెగా బ్రదర్ నాగబాబు ను ఎంపిక చేశారు. ప్రస్తుతం ఈచిత్రానికి సంభందించిన అసెంబ్లీ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. నవంబర్ నెలలో ఈ చిత్ర షూటింగ్ ను పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ తేజ, బాలకృష్ణ చిన్నప్పటి పాత్రలో నటిస్తున్నారు. భారీ తారాగణం తో తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంఫై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈచిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకురానుంది.

సంబంధిత సమాచారం :