
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, మాస్ కి కామెడీని జోడించి చెప్పే డైరెక్టర్ శ్రీను వైట్ల కాంబినేషన్ లో రానున్న మూవీ షూటింగ్ ఇటీవలే మొదలైంది. మొదటి రెండు షెడ్యూల్స్ లో భాగంగా హైదరాబాద్ లో కొన్ని సీన్స్ ని షూట్ చేసారు. కొద్ది రోజుల క్రితమే ఈ చిత్ర టీం మేజర్ షెడ్యూల్ కోసం యూరప్ వెళ్లనున్నారని తెలియజేశాం. చెప్పిన దాని ప్రకారం రామ్ చరణ్ , శ్రీను వైట్ల టీం నిన్ననే బయలుదేరి స్పెయిన్ వెళ్ళారు. రేపటి నుంచి స్పెయిన్ లో ఈ న్యూ షెడ్యూల్ ప్రారంభం కానుంది. రామ్ చరణ్ కి జోడీగా నటిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ కానుంది. రకుల్ ప్రీత్ కూడా ఈ రోజు సాయంత్రం స్పెయిన్ వెళ్లనుంది.
ఈ స్పెయిన్ షెడ్యూల్ లో రెండు పాటలతో పాటు, కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ ని షూట్ చేయనున్నారు. అక్కడి నుంచి వచ్చాక హైదరాబాద్ లో రెగ్యులర్ షూటింగ్ తో సినిమాని ఫినిష్ చేస్తున్నారు.రామ్ చరణ్ ఓ స్టంట్ మాస్టర్ పాత్రలో కనిపించనున్నాడు. అందుకోసమే రామ్ చరణ్ స్పెషల్ గా ది మార్షల్ ఆర్ట్స్ స్కూల్ లో జైక స్టంట్స్ పైన స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నాడు. రామ్ చరణ్ కి సిస్టర్ పాత్రలో కృతి కర్బంద నటించనుంది. ఈ సినిమాకి ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. యాక్షన్, సెంటిమెంట్, కామెడీ కలగలిపిన ఈ సినిమాకి డివివి దానయ్యనిర్మాత, అలాగే అక్టోబర్ 15న ఈ మూవీ రిలీజ్ కానుంది.

