కొత్త సినిమాని లైన్లో పెట్టిన మెగాహీరో !
Published on Oct 15, 2017 6:42 pm IST

చివరి చిత్రాలు ‘విన్నర్, నక్షత్రం’ వంటివి బాక్సాఫీస్ వద్ద అనుకున్నంతగా సక్సెస్ కాకపోయినా మెగాహీరో సాయి ధరమ్ తేజ్ మాత్రం ఎలాంటి ఒడిదుడుకులూ లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్లిపోతున్నారు. ఇప్పటికే స్టార్ డైరెక్టర్ వివి.వినాయక్ తో ఒక సినిమాని మొదలుపెట్టి, శరవేగంగా షూటింగ్ జరుపుతున్న ఆయన మరొక కొత్త చిత్రానికి సైన్ చేశారు.

అది కూడా ‘విన్నర్’ దర్శకుడు గోపీచంద్ మలినేనితో కావడం విశేషం. జె.భగవాన్, జె.పుల్లారావులు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వినాయక్ సినిమాతో పాటు ఇటీవలే కరుణాకరన్ తో సైన్ చేసిన రొమాంటిక్ ఎంటర్టైనర్ కూడా పూర్తయితే తేజ్ ఈ కొత్త ప్రాజెక్టును మొదలుపెట్టనున్నారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు, ఇతర టెక్నీషియన్ల వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

 
Like us on Facebook