మిలియన్ మార్క్ టచ్ చేసిన మెగా హీరో !
Published on Nov 12, 2016 2:22 pm IST

allu-arjun

మెగా హీరోల్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న హీరో అల్లు అర్జున్. సౌత్ సినీ పరిశ్రమలో బన్నీకి స్టైలిష్ స్టార్ అనే బిరుదు కూడా ఉంది. ఎప్పటికప్పుడు డ్రెసింగ్, డాన్సులు, లుక్స్, యాక్టింగ్ అన్నింటిలోనూ కొత్త కొత్త స్టైల్స్ ఫాలో అయ్యే బన్నీ యూత్ కి ఒక ఫ్యాషన్ ఐకాన్. బన్నీకి తెలుగులోనే గాక కర్ణాటక, కేరళ, తమిళనాడులో సైతం మరే తెలుగు హీరోకి లేని క్రేజ్, మార్కెట్ ఉన్నాయి. మలయాళం ప్రేక్షకులైతే అల్లు అర్జున్ ను ప్రేమగా మల్లు అర్జున్ అని పిలుచుకుంటారు. అంతటి ఫాలోయింగ్ ఉన్న ఈ మెగా హీరో తాజాగా కొత్త రికార్డ్ ని సొంతం చేసుకున్నాడు.

అదేమిటంటే తాజాగా ఈయన ట్విట్టర్ అకౌంట్లో ఉన్న ఫాలోవర్స్ సంఖ్య 1 మిలియన్ కి చేరుకుంది. సాధారణంగా మిలియన్ ఫాలోవర్స్ ని సంపాదించడం అంటే మామూలు విషయం కాదు. ఒక్క తెలుగులోనే గాక ఇతర భాషల్లో, పరిశ్రమల్లో ఫాలోయింగ్ ఉండబట్టే బన్నీకి ఈ ఘనత దక్కింది. దీంతో బన్నీ కూడా తనను మిలియన్ మార్క్ టచ్ చేసేలా చేసిన అభిమానవులకు థ్యాంక్స్ చెప్పాడు. ప్రస్తుతం హరీష్ శంకర్ డైరెక్షన్లో ‘దువ్వాడ జగన్నాథం’ చిత్రంలో నటిస్తున్న బన్నీ లింగుస్వామి దర్శకత్వంలో ఒక ద్విభాషా చిత్రాన్ని చేయనున్నాడు.

 
Like us on Facebook